
9 ఏళ్ల తర్వాత చిరు చేస్తున్న సినిమాగా ఖైది నెంబర్ 150 సినిమా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. పొంగల్ వార్లో దిగేందుకు సిద్ధంగా ఉన్న చిరు బాలయ్యకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఓ పక్క బాలకృష్ణ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సంక్రాంతి బరిలో దిగనున్న ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. అయితే ఇప్పటికే బాలయ్య శాతకర్ణి సినిమా జనవరి 12న రిలీజ్ అని ఎనౌన్స్ చేశాడు.
ఖైది సినిమా అసలైతే జనవరి 13న రిలీజ్ అన్నారు. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ రెండు రోజులు ముందుకు జరిపారట. జనవరి 11న ఖైదిని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. స్టార్ సినిమా అంటే మొదటి రోజు కలక్షన్ల బీభత్సం తెలిసిందే. మొదటి రోజే రికార్డు కలక్షన్స్ సాధించాలనే ఉద్దేశంతో ఖైదిని 11కి ఫిక్స్ చేస్తున్నారట. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు కాని ఖైది రిలీజ్ డేట్ లాక్ చేశారని అంటున్నారు.
వినాయక్ డైరక్షన్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.