
మలయాళ పరిశ్రమ నుండి మరో హీరోయిన్ తెలుగు పరిశ్రమకు ఇంట్రడ్యూస్ అవుతుంది. నాగ చైతన్య హీరోగా సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటించిన హీరోయిన్ మంజిమా మోహన్ తెలుగు తమిళ భాషల్లో ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు దర్శకుడు గౌతం మీనన్. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కల్లారా చూసిన అమ్మడు ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం పట్ల తన సంతోషాన్ని తెలిపింది. ఇక తనకు ఛాన్స్ వస్తే మెగా హీరోలైన అల్లు అర్జున్, రాం చరణ్ తో నటిస్తానని అంటుంది.
మల్లూ భామకు మెగా హీరోల మీద ఎలా మనసు మల్లింది అంటే మెగా హీరోల సినిమాలైన అల్లు అర్జున్ మలయాళంలో కూడా తన సినిమాలను రిలీజ్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్నాడు. ఇక రాం చరణ్ కి అక్కడ బాగానే క్రేజ్ ఉంది. అందుకే మెగా హీరోలపై కన్నేసింది ఈ బ్యూటీ. తన క్యూట్ లుక్స్ తో కేక పెట్టిస్తున్న ఈ భామ ఎక్స్ పోజింగ్ అంటే మాత్రం నో అని చెప్పేస్తుంది. మరి అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ ఏ రేంజ్ క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి.