గౌతమి విషయంపై కమల్ స్పందన

13 ఏళ్లుగా కలిసి ఉంటున్న కమల్ హాసన్ గౌతమిలు విడిపోయారని అందరికి తెలిసిందే. కమల్ నుండి దూరంగా వెళ్తున్నా అంటూ గౌతమి అధికారికంగా వెళ్లడించడమే కాకుండా కమల్ గురించి ప్రత్యేకంగా తన అభిప్రాయాలను తెలియచేసింది. అయితే ఈ విషయం పట్ల కమల్ కూడా వెంటనే స్పందించడం జరిగింది. గౌతమి తనకు ఇష్టమొచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్చ ఉంది. ఈ విషయంలో తన ఫీలింగ్స్ తో పని ఏం లేదు అని అన్నాడు. 

గౌతమి, సుబ్బు (గౌతమి కూతురు) ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటానని. ఏ సమయంలో ఎలాంటి అవసరం వచ్చిన వారికి తాను అండగా ఉంటానని అన్నారు కమల్. గౌతమి కూతురు సుబ్బలక్ష్మి కూడా తనకు శృతి, అక్షరలతో సమానం అని.. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడని తానేనని మెసేజ్ చేశారు కమల్ హాసన్. విడిపోతున్న ఈ ఇద్దరు తమ తమ అభిప్రాయాలను బయటపెట్టిన విధానం చూస్తుంటే లోపల ఒకరంటే ఒకరికి అభిమానం ఉన్నా పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది అన్నట్టు కనబడుతుంది.