భగవంత్ కేసరితో హిట్ కొట్టిన నందమూరి బాలకృష్ణ వెంటనే తన 109వ సినిమాని ప్రారంభించేశారు. చిరంజీవికి వాల్తేర్ వీరయ్య వంటి సూపర్ హిట్ అందించిన బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.
బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ ఆన్‌చేసి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చుక్కపల్లి సురేష్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 19వ తేదీ నుంచి ఊటీలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు బాబీ చెప్పారు. ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో బాబీ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఓ గొడ్డలి దానిపై కళ్ళద్దాలు, దానిలో ఇద్దరు పోరాడుకొంటున్న ప్రతిబింబాన్ని చూపుతూ, “బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’, ‘వయొలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ #ఎన్‌బికె109 షూటింగ్ ప్రారంభం” అంటూ ఈ సినిమా ఏవిదంగా ఉండబోతోందో పరిచయం చేశారు.
ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఈ నెల 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది కనుక త్వరలోనే దీనిలో ఈ సినిమాలో నటించబోతున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెలువడనున్నాయి.

Blood Bath Ka Brand Name 🩸
𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂 𝑽𝑰𝑺𝑰𝑻𝑰𝑵𝑮 𝑪𝑨𝑹𝑫 🪓👓 #NBK109 Shoot begins today!! 📽️

Beginning a new journey with our Natasimham #NandamuriBalakrishna garu 😍

I seek your blessings and support, as always. 🙏❤️#NBK109ShootBegins 💥@vamsi84… pic.twitter.com/bYl7izkWAB
— Bobby (@dirbobby) November 8, 2023