
మాస్ మహరాజ్ రవితేజ రెండు ఫ్లాప్స్ తర్వాత ధమాకాతో హిట్ కొట్టాడు. కానీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రేక్షకులను అంతగా ఆకటుకోలేకపోయింది. దాని తర్వాత ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ చేస్తున్నాడు. ధమాకా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పైనే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనిని సంక్రాంతి పండుగ సందర్భంగా 2024, జనవరి 13న విడుదలకాబోతోంది.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మెల్లగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. వాటిలో భాగంగా ఈ సినిమా టీజర్ నిన్న విడుదల చేశారు. ఇది కూడా పూర్తి యాక్షన్ చిత్రమే అని టీజర్ చూస్తే అర్దమవుతుంది.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటిస్తున్నారు. నవదీప్, మధుబాల, శ్రీనివాస్ అవసరాల, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, కెమెరా, స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: కరణం మణిబాబు, సంగీతం: దవ్ జాంద్ చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ‘ఈగల్’ నిర్మిస్తున్నారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/hOSDC605Mgg?si=CHzCxgIyLwWrQtTK" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>