కేరళలో సలార్‌కు పార్ట్‌నర్: పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్‌ జంటగా తెరకెక్కుతున్న సలార్ డిసెంబర్‌ 22న విడుదల కాబోతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసింది. ఈ సినిమాను రూ.200-250 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తునందున, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలలో బిజినెస్ డీల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. కేరళ రాష్ట్రంలో పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్‌ తమ వ్యాపార భాగస్వామిగా కలిసిన్నట్లు సలార్ బృందం ప్రకటించింది. 

 ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి, పృధ్వీరాజ్ సుకుమారన్, టీను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్    ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ దేవరకొండ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.