
అక్కినేని అఖిల్ తన చిన్న నాటి స్నేహితురాలు శ్రీయా భూపాల్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. రెండు ఫ్యామిలీలు వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పెళ్లి బాజాలు మోగించనున్నారు. డిసెంబర్ 9న అఖిల్ శ్రీయాల ఎంగేజ్మెంట్ జరుగనుంది. దానికి సంబందించిన ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. నాగార్జున వారసుడిగా అఖిల్ లాస్ట్ ఇయర్ అఖిల్ సినిమా ఎంట్రీ ఇచ్చాడు.
మొదటి సినిమాతో తన సత్తా చాటుకున్న అఖిల్ రియర్ల్ లైఫ్ లో ఇంత త్వరగా హీరోయిన్ వెతుక్కుంటాడని ఎవరు ఊహించు ఉండరు. కొద్ది రోజులుగా హడావిడి చేస్తున్న అక్కినేని పెళ్లి సందడిలో ఈ ఎంగేజ్మెంట్ కార్డ్ బయటకు రావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ మరింత ఉత్సాహంలో ఉన్నారు. తనయులిద్దరు వారు ఇష్టపడ్డ వారితోనే పెళ్లిచేస్తున్న నాగ్ పెద్దరికం కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అఖిల్ శ్రీయా ఎంగేజ్మెంట్ డేట్ అయితే లాక్ అయ్యింది మరి పెళ్లి ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.