
నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమా నుంచి ‘అమ్మాడి...’ అంటూ సాగే మరో పాట విడుదలైంది. కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాటకు హెషమ్ అబ్దుల్ వాహేబ్ చక్కగా స్వరపరచగా దానిని కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ చాలా మృదుమధురంగా పాడారు. ముఖ్యంగా ఈ పాటలో నాని, మృణాల్ ఠాకూర్ నటన చాలా సహజంగా ఆకట్టుకొనెలా ఉంది. తండ్రి కూతుర్ల సెంటిమెంట్‌తో పాటు మంచి రొమాన్స్ కూడా ఉందని ఈ పాట చూస్తే అర్దమవుతుంది. ఈ సినిమాలో నాని కూతురుగా బాలీవుడ్ బాలనాటి కియరా ఖన్నా నటిస్తోంది.
ఈ సినిమాతో శౌర్యూవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్, పృధ్వీ.
వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి ‘హాయ్ నాన్న’ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కాబోతోంది.