భారతీయుడు-2 టీజర్‌ వచ్చేసిందిగా!

శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు-2 టీజర్‌ ఈరోజు విడుదలైంది. ‘నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్’ అంటూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వేషధారణలో కమల్ హాసన్ డైలాగ్‌తో టీజర్‌ ముగించడం బాగుంది. టీజర్‌ చూస్తే ఈ సినిమాలో కూడా దేశంలోని లంచగొండి  అధికారులను కమల్ హాసన్ శిక్షించడం కధాంశంగా తీసుకొని మరిన్ని యాక్షన్ సన్నివేశాలను సినిమాలో జోడించిన్నట్లు స్పష్టమయ్యింది. 

ఈ సినిమాలో కమల్ హాసన్, సిద్దార్థ్, ఎస్.జె. సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. 

భారతీయుడు-2కి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: శంకర్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: రవివర్మన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయంట్ మూవీస్ బ్యానర్లపై సుభాస్కరన్, ఉదయానిధి స్టాలిన్ కలిసి రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. భారతీయుడు-2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవంనాడు విడుదలకానుంది.