ఘనంగా వరుణ్ తేజ్, లావణ్యల వివాహం

టాలీవుడ్‌ నటులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కాని నగరంలో 1వ తేదీ రాత్రి 7.18 గంటలకు సమీపం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వారి వివాహం జరిగింది. వారి వివాహ వేడుకకు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, నితిన్ దంపతులు, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బంధుమిత్రులు, సినీ పరిశ్రమలోవారి కోసం ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌, మాదాపూర్‌లోని ఎన్‌-కన్వెన్షన్ సెంటర్‌ రిసెప్షన్ (విందు) నిర్వహించనున్నారు. 

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారిగా  మిస్టర్ (2017) సినిమాలో కలిసి నటించారు. అప్పుడే వారి మద్య ప్రేమ చిగురించింది. ఇన్నేళ్ళ ప్రేమ తర్వాత ఇప్పుడు పెళ్ళి చేసుకొని జీవితభాగస్వాములయ్యారు.