దేత్తడి హారిక మంచి ఛాన్స్ పట్టేసిందిగా?

అలేఖ్య హారిక అంటే మన దేత్తడి హారికకు చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా ఛాన్స్ లభించింది. బేబీ వంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన ఎస్‌కెఎన్, సాయి రాజేష్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో హారికకు ఈ అవకాశం లభించింది. ఈ సినిమాలో ఆమె సంతోష్ శోభన్‌కు జోడీగా నటించబోతోంది   

సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రముఖ నటుడు నాగ చైతన్య వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నటీనటులు, దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.             

సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై పెరోడక్షన్ నంబర్: 4గా నిర్మించబోతున్న ఈ సినిమాకు సాయి రాజేష్ కధ, స్క్రీన్ ప్లే అందించబోతున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా ప్రీ ఫస్ట్-లుక్ పోస్టర్‌ పోస్టర్ విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్‌లో హీరోహీరోయిన్లు ముద్దు పెట్టుకొంటున్న ఫోటో, దాని కింద “కొన్ని ప్రేమకధలు జీవితకాలం వెంటాడుతాయి,” అంటూ కాప్షన్ ఇచ్చారు. కనుక ఇది కూడా బేబీ వంటి కల్ట్ రొమాంటిక్ మూవీ అని భావించవచ్చు.