సునీల్ కు లక్ తగిలినట్టే..!

హీరోగా టర్న్ ఇచ్చిన కొత్తలో హిట్లు అందుకున్న సునీల్ ఆ తర్వాత మాత్రం అది అందని ద్రాక్ష లానే అయ్యింది. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని సినిమా ఫలితాలు మాత్రం సునీల్ కు ఏమాత్రం హిట్ అందించలేకపోతున్నాయి. ఇక ఈ క్రమంలో సునీల్ సినిమా అంటే దర్శక నిర్మాతలు కూడా తప్పుకునే పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా సునీల్ నుండి వచ్చిన ఈడు గోల్డ్ ఎహే సినిమా అయితే మరి ఘోరంగా పోయింది.

ఈ క్రమంలో మలయాళ సూపర్ హిట్ సినిమా టూ కంట్రీస్ రీమేక్ కు ముందు సునీల్ హీరోగా అనుకున్నారు కాని ప్రస్తుతం సునీల్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆ సినిమా అటకెక్కిందని అన్నారు. ఎన్.శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ముహుర్తం కూడా అయ్యింది. వరుసగా ఫ్లాపులు కొట్టడంతో సునీల్ కు ఈ అవకాశం కూడా చేజారింది అనుకున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం టూ కంట్రీస్ రీమేక్ నుండి సునీల్ ఎక్సిట్ అవలేదట. అంతేకాదు ఈ నెల 7 నుండి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారట. 

సో ఈ లెక్కన సునీల్ కు లక్ అందినట్టే. ఒకభాషలో ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమా మరో భాషలో తీయడం కామనే ఇక్కడ కూడా అదే సక్సెస్ అందుకుంటుందని చెప్పుకోవచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఎమోషన్స్ కలిగిన ఈ సినిమాలో సునీల్ తో పాటు నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. సినిమా షూటింగ్ చాలావరకు అమెరికాలో జరుగుతుందని తెలుస్తుంది.