రామాయణ్ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్?

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో మరోసారి రామాయణం ఆధారంగా మరో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో శ్రీరాముడుగా బాలీవుడ్‌ నటుడు రణబీర్ కపూర్, సీతమ్మగా టాలీవుడ్‌ నటి సాయి పల్లవి ఖరారయ్యారు.

హనుమంతుడిగా బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌, రావణుడుగా కన్నడ నటుడు యష్ నటించే అవకాశం ఉంది. వీరిద్దరినీ ఒప్పించేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 

సన్నీ డియోల్ హనుమంతుడి పాత్ర చేయడానికి అంగీకరించినప్పటికీ, అందుకోసం ఏకంగా రూ.45-50 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటించిన గద్దర్-2 ఇటీవల విడుదలై సూపర్ హిట్ అవడంతో ఆయన రేటు పెంచేసి రూ.70 కోట్లు వరకు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది రామాయణ గాధలో హనుమంతుడి పాత్ర కనుక రూ.45-50 కోట్లుకి ఒప్పుకొంటున్నానని చెప్పిన్నట్లు తెలుస్తోంది. ఒకసారి సినిమా మొదలుపెడితే మద్యలో మరో సినిమా చేయనని సన్నీ డియోల్ ఆఫర్ కూడా ఇస్తున్నాడట! 

కనుక ఈ రెండు పాత్రలు ఖరారైతే మిగిలిన పాత్రలకు ఎవరెవరిని తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. అయితే సీతారామలక్ష్మణులు, హనుమంతుడు, రావణుడు పాత్రలకే సుమారు రూ. 200-300 కోట్లు ఖర్చవుతుంటే, మిగిలిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి ఇంకెంత ఖర్చవుతుందో, మూడు భాగాలుగా తీయబోతున్న ఈ సినిమాకు మరెంత ఖర్చవుతుందో?ఊహించడం కష్టమే.