
తరుణ్ భాస్కర్ ప్రధానపాత్రలో స్వీయ దర్శకత్వంలో చేస్తున్న కీడాకోలా సినిమా నవంబర్ 3వ తేదీన విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో సినిమా విడుదల కాబోతుండటంతో ఈ సినిమా నుంచి కయ్యాల చిందాట... అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు. నికిలేష్ సుంకొజీ వ్రాసిన ఈ పాటకు వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, హేమచంద్ర బృందం ఆలపించింది.
ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, చైతన్య రావు, మయూర్,తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: ఏజె ఆరోన్, ఎడిటింగ్: ఉపేంద్ర వర్మ, యాక్షన్: రాజ్ కుమార్, ఆర్ట్: ఆశిష్ తేజ పుల్లల చేశారు.
విజీ సైన్మా బ్యానర్‌పై కె.వివేక్ సుధాంశు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద నందిరాజ్ మరియు ఉపేంద్ర వర్మ కలిసి నిర్మించిన ఈ సినిమాకు సురేశ్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్. నవంబర్ 3వ తేదీన కీడాకోలా సినిమా విడుదల కాబోతోంది.