సలార్, దేవర, గుంటూరు కారం పోస్టర్లు

నేడు దసరా పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం సినీ నిర్మాణ సంస్థలు తమ కొత్త సినిమా పోస్టర్లను విడుదల చేశాయి. వాటిలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోహీరోయిన్లుగా చేస్తున్న గుంటూరు కారం, చిరంజీవి-వశిష్టల మెగా 156, ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్ (సీజ్ ఫైర్ పార్ట్-1), జూ.ఎన్టీఆర్‌-కొరటాల శివ  దేవర, సుధీర్ బాబు-జ్ఞానసాగర్ కాంబినేషన్‌లో హరోంహర (ది రివోల్ట్)  సినిమా పోస్టర్లు విడుదలయ్యాయి. 

వీటిలో గుంటూరు కారం సినిమా జనవరి 12న, సలార్ సినిమా డిసెంబర్‌ 22న, దేవర సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.