
ఈరోజు దసరా పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి 16వ చిత్రానికి సంబందించి పోస్టర్ విడుదల చేశారు. మొదట తన కుమార్తె సుష్మిత నిర్మించబోతున్న సినిమా మొదలుపెట్టాలని అనుకొన్నారు. కానీ దాని కంటే ముందు బింబిసార దర్శకుడు మల్లాది వశిష్ట దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ సినిమా మొదలుపెట్టాలని నిర్ణయించుకోవడంతో ఈ సినిమాయే చిరంజీవి 156వ సినిమా కాబోతోంది. కనుక ఈరోజు దసరా పండుగ సందర్భంగా ‘మెగా 156’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా పోస్టర్ విడుదల చేసింది.
నేడు దసరా పండుగ సందర్భంగా మెగా156 సినిమా ముహూర్తపు షాట్‌కు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి లాంఛనంగా సినిమాని ప్రారంభించారు. పాటల రికార్డింగ్ కార్యక్రమంతో లాంఛనంగా మొదలుపెట్టిన్నట్లు ఈ సినిమాని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ తెలియజేసింది.
కీరవాణి మాట్లాడుతూ “ఒకప్పుడు సినిమాలను పాటల రికార్డింగ్‌తో ప్రారంభించే ఆనవాయితీ ఉండేది. ఈ సినిమాతో మళ్ళీ ఆ విధానాన్ని పునః ప్రారంభిస్తున్నాము. ముందుగా సెలబ్రేషన్ సాంగ్‌తో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమా పనులు మొదలుపెడుతున్నాము. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలుంటాయి,” అని చెప్పారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బేనర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మించబోతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మృణాళిని ఠాకూర్ నటించబోతున్నట్లు సమాచారం.