దసరా తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో చంద్రముఖి-2

కోలీవుడ్ నటుడు లారెన్స్ రాఘవ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ ప్రధానపాత్రలలో చంద్రముఖి-2 గత నెల 28న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అప్పట్లో కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అయ్యింది. దానికి వెంటనే సీక్వెల్ చేద్దామని దర్శకుడు పి.వాసు కోరినప్పటికీ మళ్ళీ ఆ స్థాయిలో తీయడం కష్టమని రజినీకాంత్ సున్నితంగా తిరస్కరించారు. ఆయన ఊహించిన్నట్లే పి.వాసు దర్శకత్వంలోనే వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి, ఇప్పుడు లారెన్స్ రాఘవ హీరోగా వచ్చిన చంద్రముఖి-2 రెండూ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 

ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ స్వయంగా ట్విట్టర్‌లో ఈవిషయం తెలియజేసింది.