కాలిపోయిన మహేష్ మూవీ సెట్టింగ్..!

మొన్న జరిగిన దీవాళి సెలబ్రేషన్స్ కారణంగా మహేష్ మురుగదాస్ మూవీకి సంబందించిన ఓ సెట్ ప్రాపర్టీ మొత్తం కాలిపోయినట్టు సమాచారం. హైదరాబాద్ జూబిలి హిల్స్ రోడ్ నెంబర్ 87 లో మహేష్ సినిమా కోసం సెట్ వేయడం జరిగింది. అయితే ఇదే సెట్ లో ఇదవరకు జ్యో అచ్యుతానంద మూవీ షూటింగ్ కూడా జరుపుకుందట. అయితే దాన్ని కాస్త మార్చేసి మురుగదాస్ మహేష్ మూవీ కోసం వాడేస్తున్నారు. సడెన్ గా ఈ సెట్ అంతా మంటలతో కాలిపోయిందట. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే మొత్తం బూడిద అయ్యిందట.

ఈ సెట్ మహేష్ మూవీకి సంబందించినది అయినా సరే దానిలో చేయాల్సిన షూటింగ్ అంతా ముగించుకున్నారట. అందుకే ఆ సెట్ కు ఇప్పుడు ఈ చిత్రయూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. అయితే సెట్ ప్రాపర్టీ మాత్రం కాస్త నష్టం తెచ్చిపెట్టిందట. మరి దాని లాస్ ఎవరికి తగులుతుందో తెలియదు. మొత్తానికి ఈ దీవాళిలో జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇదే అని చెప్పాలి. మరి సంఘటన ఎలా జరిగింది అన్నది ఇంకా డీటేల్స్ తెలియాల్సి ఉంది.