జూ.ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం

ఆర్‌ఆర్ఆర్ సినిమాలో నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జూ.ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం

లభించింది. ఆస్కార్ అవార్డ్స్ కమిటీలో భాగంగా ఉండే యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యుడుగా ఎంపియకయ్యారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ స్వయంగా ఈ విషయం తెలియజేసింది. “తమ అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోసి యావత్ ప్రపంచదేశాల ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇలాంటి గొప్ప నటీనటులను యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ఆహ్వానిస్తున్నాము,” అని ట్వీట్ చేసింది. 

ఈ యాక్టర్స్ బ్రాంచ్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీతలు కె హ్యూ క్వాన్, మార్ష స్టెఫైన్ బ్లేక్,కేర్రి కాండన్.రోసా సలజర్ సభ్యులుగా నామినేట్ అయ్యారు.