
విజయ్ దేవరకొండకి రౌడీ హీరోగా అభిమానులలో మంచి గుర్తింపు సంపాదించుకోగలిగాడు కానీ అటువంటి పాత్రలతో, సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమని గ్రహించిన్నట్లే ఉన్నాడు. అందుకే మళ్ళీ ఖుషీతో గీతాగోవిందం స్టైలుకి వచ్చేశాడు.
దాంతో పూర్తిగా ఒడ్డున పడలేదు కానీ పరవాలేదనిపించుకొన్నాడు. కనుక ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో మళ్ళీ లవర్ బాయ్, ఫ్యామిలీ హీరోగా ట్రై చేయడానికి సిద్దపడిన్నట్లున్నాడు. అయితే హటాత్తుగా కన్వర్ట్ అయినా ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో అనుకొన్నాడో ఏమో దానిలో కూడా కాస్త రౌడీ హీరోని చూపాడు.
నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌లో దర్శకుడు పరశురామ్ విజయ్ దేవరకొండలోని ఈ రెండు కోణాలకు సరిపడే సన్నివేశాలను చక్కగా చూపారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ భార్యభర్తలుగా నటిస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, వాసువర్మలతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: కెయు మోహన్, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరిలో సంక్రాంతికి విడుదల చేస్తామని ఫస్ట్ గ్లిమ్స్‌లో మరోసారి స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ-పరశురామ్-దిల్‌రాజు ముగ్గురూ కలిసి ఈ సినిమాని ఇంతవేగంగా పూర్తి చేస్తుండటం అభిమానులకు చాలా సంతోషం కలిగిస్తుంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/UcmgJAQ-Ibc?si=ljvhYFTrk9VaqSfj" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>