అడ్డంగా బుక్ అయిన అనుష్క..!

సెలబ్రిటీస్ మీద మీడియా నిఘా ఎప్పుడు ఉండనే ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏ విధంగా బుక్ అవుతారా అని ఎదురుచూస్తుంటారు. పైకి ఫ్రెండ్స్ అంటూ లోపల ప్రేమ పక్షులుగా ఉన్న ఎంతోమంది కపుల్స్ ను ఓ విధంగా కలిపింది మీడియానే. అయితే ఈ క్రమంలో ఇండియా క్రికెట్ టీంలో దూకుడు ఆటగాడు విరాట్ కొహ్లి, బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య ప్రేమ సరిగమలు నడుస్తున్నాయని అప్పట్లో టాక్. అంతేకాదు మన వాడు హిట్ అయితే ఏం లేదు కాని పర్ఫార్మెన్స్ లో ఫెయిల్ అయితే మాత్రం ఆ ఎఫెక్ట్ అనుష్క మీద చూపించే వారు. తప్పేలేదు అభిమానం అలాంటిది అనుకోండి. 

అయితే కొంతకాలంగా ఇద్దరు చెరో దారి పట్టారు. ఎక్కడైనా ఇద్దరు కలిసి కనిపిస్తారా అంటే అలాంటి సందర్భం ఒక్కటి కనబడలేదు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అనుష్క ప్రేమ మీద తనకున్న ఫీలింగ్ నిక్కచ్చిగా చెప్పేసింది. ఆమె మాటలని బట్టి చూస్తే విరాట్ తో అమ్మడి ప్రేమ కథ కంచికి చేరిందని అనుకున్నారు కాని రీసెంట్ గా ఇండియ సూపర్ లీగ్ మ్యాచ్ చూసేందుకు తన ప్రియుడు విరాట్ తో కలిసి వచ్చింది అనుష్క శర్మ. గోవా టీంకు కో స్పాన్సర్ అయిన విరాట్ మ్యాచ్ చూసేందుకు రాగా తనతో తన ప్రేయసిని వెంటతెచ్చుకున్నాడు. ఇంకే ఒకటే కెమెరా క్లిక్కులు మీద క్లిక్కులు.. విడిపోయారు అంటూ సైలెంట్ గా ఉన్న మీడియా అంతా మళ్లీ వీరి మీద పడ్డారు. మరి ఇంతకీ వీరిద్దరి మధ్య లవ్ మ్యాజిక్ ఉందా లేదా అన్నది ఎవరో ఒకరు తేల్చి చెబితే బాగుంటుంది లేదంటే కన్ ఫ్యూజన్ తో ఫ్యాన్స్ పిచ్చివాళ్లు అయ్యేలా ఉన్నారు.