కీడాకోలా ట్రైలర్‌... రాజకీయ కామెడీ?

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విభిన్నమైన కధాంశంతో తెరకెక్కుతున్న కీడాకోలా సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ చూస్తే తెలంగాణ నేపధ్యంలో సాగే కధలో పుష్కలంగా కామెడీ ఉందని స్పష్టమైంది. బొద్దింక పడిన ఓ కూల్ డ్రింక్ బాటిల్‌ని అడ్డుపెట్టుకొని ఆ కంపెనీపై దావా వేసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు యువకుల ఆరాటాలు, వాటి కారణంగా కోర్టు కేసు, గల్లీ స్థాయి చవుకబారు రాజకీయాలు ట్రైలర్‌లో చూపించి తరుణ్ భాస్కర్ కాస్త గజిబిజీగానే అనిపించినప్పటికీ వీటన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ సినిమాని తెరకెక్కించి ఉంటే, తరుణ్ భాస్కర్ కెరీర్‌లో ఇది మరో సూపర్ హిట్ కావచ్చు.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం, చైతన్య రావు, మయూర్,తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: ఏజె ఆరోన్, ఎడిటింగ్: ఉపేంద్ర వర్మ, యాక్షన్: రాజ్‌ కుమార్, ఆర్ట్: ఆశిష్ తేజ పుల్లల చేశారు.

విజీ సైన్మా బ్యానర్‌పై కె.వివేక్ సుధాంశు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద నందిరాజ్ మరియు ఉపేంద్ర వర్మ కలిసి నిర్మించిన ఈ సినిమాకు సురేశ్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్. నవంబర్‌ 3వ తేదీన కీడాకోలా సినిమా విడుదల కాబోతోంది.