
ఈ ఏడాది దసరా పండుగకి మూడు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలలు ప్రధాన పాత్రలలో భగవంత్ కేసరి రేపు (గురువారం) విడుదల కాబోతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.
కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లియో కూడా రేపే (గురువారం) విడుదల కాబోతోంది. విజయ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల కాకమునుపే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ మెనన్ తదితరులు నటించారు. ఉత్తరాది రాష్ట్రాలలో కూడా లియో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నట్లు స్పష్టమవుతోంది.
ఇక మాస్ మహరాజ్ రవితేజ బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావుగా ఎల్లుండి (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. అందుకే రవితేజ కెరీర్‌లో తొలిసారిగా ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం తర్వాత రేణూ దేశాయ్ ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించారు.
కనుక మూడు సినిమాలు దేనికవి ధీటుగానే కనిపిస్తున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలో విడుదలవుతున్న ఈ మూడు పెద్ద సినిమాలు ఒకదానికి మరొకటి పోటీ ఇవ్వబోతున్నాయి. కనుక ఈ పోటీలో ఏది నెగ్గుతుందో చూడాలి.