ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకొన్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఈ అవార్డు లభించింది. అల్లు అర్జున్ అర్జున్‌కి ఇది తొలి జాతీయ అవార్డు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ క్రీమ్ కలర్ సూట్ ధరించి చాలా హుందాగా, స్టయిలిష్‌గా కనిపించారు. ఈ కార్యక్రమంలో స్నేహరెడ్డి కూడా పాల్గొని భర్త అల్లు అర్జున్ భార్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకొంటుండగా చూసి మురిసిపోయారు. అందుకొన్నారు.
పుష్ప సూపర్ డూపర్ హిట్ అవడంతో అల్లు అర్జున్, సుకుమార్ కలిసి దాని రెండో భాగంగా పుష్ప-ది రూల్ చేస్తున్నారు. రెండో భాగంలో కూడా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. పుష్ప-2 సినిమా 2024, ఆగస్ట్ 15వ తేదీన విడుదల కాబోతోంది.