
విలక్షణ నటుడు కమల్ హాసన్ గౌతమిల రిలేషన్ గురించి అందరికి తెలిసిందే. కొన్నేళ్లుగా కలిసి ఉంటున్న ఈ ఇద్దరు ఇప్పుడు చెరోదారి చూసుకుంటున్నారట. ఈ విషయం గౌతమి స్వయంగా తన అఫిషియల్ వెబ్ పేజ్ లో ఎనౌన్స్ చేసింది. కమల్ తో తనకున్న అనుబంధం ఈరోజుతో ముగిసిందని తన కెరియర్ కు అండగా ఉన్న కమల్ తనకు ఎప్పుడు అభిమాన నటుడని అన్నది గౌతమి. 13 ఏళ్ల పాటు కొనసాగిన ఈ బంధం అనూహ్యంగా తెగదెంపులుచేసుకునేందుకు కారణాలు ఏమై ఉంటాయా అన్నది తెలీయలేదు కాని ఈ విషయం చెబుతూ గౌతమి ఎంతో బాధపడింది.
ఇక కమల్ తన అభిమాన నటుడని.. మునుముందు కూడా మంచి సినిమాలు చేస్తారని తన సందేశంలో పెట్టింది. కమల్ ఫ్యామిలీ చేస్తున్న శభాష్ నాయుడు సినిమాలో శృతి హాసన్ కు గౌతమికి మధ్య గొడవలయ్యాయని అప్పట్లో టాక్ వచ్చింది. మరి ఆ గొడవ వల్లే గౌతమి కమల్ కు గుడ్ బై చెప్పిందా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియదు కాని దశాబ్ధానికి పైగా కలిసి ఉన్న ఈ ఇద్దరు ఒకరిని ఒకరు విడిచిపెట్టడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
హీరోయిన్ గా కెరియర్ మంచి క్రేజ్ మీద ఉన్న సందర్భంలో ఓ బిజినెస్ మెన్ ను పెళ్లాడిన గౌతమి అతని దగ్గర నుండి త్వరగానే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కమల్ తో కలిసి సినిమాలు చేసిన చనువుతో అతనికి దగ్గరైంది. ఇన్నేళ్లుగా కలిసి ఉంటున్నా ఈ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాలేదు కాని సడెన్ గా ఈరోజు ఉదయం ఆమె ఈ మెసేజ్ తో అందరికి షాక్ ఇచ్చేసిందని చెప్పాలి.