
టాలీవుడ్ యువతరం నటులలో సిద్ధూ జొన్నలగడ్డ వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సిద్ధూ చేయబోతున్న సినిమాతో ప్రముఖ స్టయిలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి ‘తెలుసు కదా’ అనే టైటిల్ ఖరారు చేసి ‘తెలుసు కదా...’ అంటూ సాగే పాటతో చిన్న వీడియో క్లిప్ కూడా విడుదల చేశారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ సినిమా. టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా,శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించబోతున్నారు.
ఈ సినిమాకు సంగీతం: ఎస్. తమన్, కెమెరా: యువరాజ్ జె, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించి పూర్తివివరాలను తెలియజేస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది.