పుష్పరాజ్ ఢిల్లీకి బయలుదేరాడు

అల్లు అర్జున్‌ అర్జున్ దంపతులు నేడు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్‌ నటనకు ‘ఉత్తమ నటుడు’గా జాతీయ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్‌ ఈ అవార్డు అనుకోబోతున్నారు. ఇంతకు ముందు చాలా మంది నటీమణులకు జాతీయ అవార్డులు వచ్చాయి కానీ తెలుగు నటులకు ఎవరికీ రాలేదు. తొలిసారిగా అల్లు అర్జున్‌ ‘ఉత్తమ నటుడు’గా జాతీయ అవార్డు అందుకోబోతున్నారు. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోనే పుష్ప-2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2024, ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 విడుదల కాబోతోంది.