సైంధవ్ టీజర్‌... వెంకీ ఈజ్ బ్యాక్!

శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. ఈ సినిమా టీజర్‌ ఇవాళ్ళ విడుదల చేశారు. దానిలో వెంకటేష్ యాక్షన్ చూస్తున్నప్పుడు, ఘర్షణ, నారప్ప సినిమాలలో వెంకటేష్ రౌద్రరూపం గుర్తొస్తుంది. టీజర్‌లో శైలేష్ కొలను అద్భుతమైన టేకింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మణికందన్ సినిమాటోగ్రఫీ కూడా బాగా కుడిరాయని టీజర్‌ చూస్తే అర్దమవుతుంది. టీజర్‌ సైంధవ్ సినిమాపై అంచనాలు మరింత పెంచిందని చెప్పవచ్చు. 

ఈ సినిమాలో బేబీ సార, నవాజుద్దీన్ సిద్ధికీ, ఆర్య, శ్రద్ద శ్రీనాధ్, రుహాని శర్మ, ఆండ్రియా, జీషు సేన్ గుప్తా, ముకేష్ ఋషి ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, సినిమాటోగ్రఫీ: మణికందన్, ఎడిటింగ్: గారీ బీహెచ్ చేస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.