వీడీ13 టైటిల్‌ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే...

వీడీ13 వర్కింగ్ టైటిల్‌తో విజయ్‌ దేవరకొండ 13వ సినిమా పరశురామ్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నామకరణం (టైటిల్‌ అనౌన్స్‌మెంట్) చేస్తామంటూ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఇవాళ్ళ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఎల్లుండి అంటే బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రకటిస్తామని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది. దానిలో స్కూలుకి వెళుతున్న విద్యార్దులు, వారి పక్కనే ఓ పాపను చెయ్యిపట్టుకొని తీసుకువెళుతున్న విజయ్‌ దేవరకొండని వెనుకవైపు నుంచి చూపారు.      

గీతా గోవిందం వంటి సూపర్ హిట్ అందిందించిన పరశురామ్ పేట్ల దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తే ఇది కూడా పరశురామ్ మార్క్ ఫ్యామిలీ డ్రామా అయ్యుండవచ్చనిపిస్తోంది. 

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 50 శాతం పైగా పూర్తయింది. నవంబర్‌ నెలాఖరులోగా షూటింగ్ పూర్తిచేసి జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఈ సినిమాలో  విజయ్‌ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్‌ నటిస్తోంది. గీతా గోవిందంకు సంగీతం అందించిన గోపీ సుందర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెయు మోహన్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు.