హాయ్ నాన్న... టీజర్‌

నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న టీజర్‌ వచ్చేసింది. ఊహించిన్నట్లే, తండ్రీ కూతుర్ల అనుబంధం, హీరో హీరోయిన్ల రొమాన్స్ రెండు సమపాళ్ళలో టీజర్‌లో ఇమిడ్చి విడుదల చేశారు. నాచురల్ స్టార్ నాని పేరుకు తగ్గట్లుగానే టీజర్‌లో నాని నటన, భావోద్వేగాలు, సన్నివేశాలు హృదయాలను తాకేలా ఉన్నాయి. ఇదే లెక్కన సినిమా తెరకెక్కించి ఉంటే సూపర్ హిట్ అవడం ఖాయమే. 

ఈ సినిమాలో నానికి జంటగా మృణాల్ ఠాకూర్, కూతురుగా బాలీవుడ్‌ బాలనటి కియరా ఖన్నా నటించారు. 

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి ఈ ‘హాయ్ నాన్న’ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాతో శౌర్యూవ్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్‌, పృధ్వీ. 

ఈ సినిమా డిసెంబర్‌ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకాబోతోంది.