భగవంత్ కేసరితో 2023 కూడా బాలయ్యదేనట!

నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు సభ్యులు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాలో మరో కొత్త బాలయ్యని చూపించారని ప్రశంశించారు.

అనిల్ రావిపూడి సినిమాని తెరకెక్కించిన విధానం చాలా బాగుందని సెన్సార్ బోర్డు సభ్యులు మెచ్చుకొన్నారు. దీనిపై ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమేర్ సింధు స్పందిస్తూ “భగవంత్ కేసరి సెన్సార్ పూర్తయింది. 2023 సంవత్సరం బాలయ్యదే” అని ట్వీట్ చేశారు. 

సెన్సార్ బోర్డు సభ్యులు తన సినిమాని, దర్శకత్వాన్ని మెచ్చుకొన్నందుకు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య, కాజల్ అగర్వాల్ మీద ఓ డ్యూయెట్ సాంగ్ చిత్రీకరించామని, కానీ తాను నిజాయితీగా కధను చెప్పాలనుకొన్నందున అది కధకు అడ్డుతగులుతుందని భావించి ప్రస్తుతానికి ఆ పాటని తొలగించామని చెప్పారు. కానీ బాలయ్య అభిమానులకు దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి ఆ పాటని కూడా సినిమాలో జోడిస్తామని చెప్పారు.      

భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ, కాజల్ జంటగా నటించగా, వారి కూతురుగా శ్రీలీల నటించింది. ఈ సినిమాలో రాంపాల్, శ్రవణ్, ప్రియాంకా జవల్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకు కధ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: ఎస్ఎస్ ధమన్, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్‌: వి వెంకట్ చేశారు. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ శంకర్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. అక్టోబర్‌ 19న భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.