మాస్ డైరెక్టర్, మాస్ హీరో కాంబినేషన్‌లో ఓ మాస్ సినిమా వస్తే ఎలా ఉంటుంది?అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన స్కంద సినిమా కూడా అలాగే ఉంటుందని అందరూ భావించారు. అందుకే మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.
రామ్ పోతినేని కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. అయితే ఉత్తరాది రాష్ట్రాల భాష, సంస్కృతి, నేటివిటీలను పట్టించుకోకుండా తెలుగు సినిమాని హిందీలో చుట్టబెట్టేసి వదిల్తే ఉత్తరాది ప్రజలు చూస్తారా లేదా అని ఆలోచించకుండా తీసి చేతులు కాల్చుకొన్నారు దర్శకనిర్మాతలు.
స్కండాకూ మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ క్రమంగా పడిపోయాయి. దాంతో యావరేజ్ మాస్ మసాలా సినిమా అనిపించుకొని థియేటర్ల నుంచి బయటపడుతోంది. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ ప్లస్ ఓటీటీలోకి రాబోతోంది. ఈనెల 27 నుంచి ప్రసారం కాబోతోంది.