సంబంధిత వార్తలు

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ టాక్ షో మొదటి రెండు భాగాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు సీజన్-3 ప్రారంభిస్తున్నారు. ఈ నెల 17 నుంచిఆహా ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయని ట్విట్టర్లో తెలియజేసింది.
తొలి షోలో భగవంత్ కేసరి సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, ఆ సినిమాలో బాలయ్య భార్యగా నటించిన కాజల్ అగర్వాల్, వారి కూతురుగా నటించిన శ్రీలీలను బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. తొలిషోలో పాల్గొనబోయే ముగ్గురు ఫోటోలను కూడా ట్విట్టర్లో విడుదల చేశారు.