గులాబీ బుగ్గల సాయి పల్లవికి సీతమ్మవారిగా నటించే అవకాశం లభించింది. ఈ విషయం ఆమె స్వయంగా ధృవీకరించింది. ఆమె చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విలేఖరులు దీని గురించి ప్రశ్నించగా, “అవును. నేను సీతమ్మవారిగా నటించబోతున్నాను. ఇటువంటి గొప్ప అవకాశం నాకు లభిస్తునందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను సీతమ్మవారి పాత్ర చేయడానికి సరిపోతానని భావించిన నితీష్ తివారీగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
మన దేశంలో ఇప్పటికే రామాయణం ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. వాటిలో సీతమ్మవారీగా గొప్ప గొప్ప నటీమణులు నటించి మెప్పించారు. ఇప్పుడు నాకు కూడా ఆ అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారిలో పదోవంతు చేసి మెప్పించినా నా జన్మ ధాన్యం అయిన్నట్లే భావిస్తాను.
నితీష్ తివారీ నుంచి ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా ఎప్పుడు ముంబయి వెళదామా? ఎప్పుడు ఈ సినిమా మొదలవుతుందా?అని నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను,” అని సాయి పల్లవి తన మనసులో ఆనందాన్ని పంచుకొంది.
రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా చేయబోతున్నారు. కేజీఎఫ్ హీరో యష్ రావణుడిగా చేయబోతునట్లు తెలుస్తోంది. మొదటి భాగం క్లైమాక్స్ సన్నివేశంలో రావణుడు ప్రవేశించే విదంగా నితీశ్ తివారీ కధని సిద్దం చేసుకొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కనుక ఒకటి రెండు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.