మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్‌తో వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని యూవీ క్రియెషన్స్ ప్రకటించింది.
దర్శకుడు వశిష్ట, చిరంజీవి, కెమెరా మ్యాన్ ఛోటా కె నాయుడు తదితరులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి తర్వాత మొదలవుతుందని వార్తలు వచ్చినప్పటికీ ఈ నవంబర్ నెలాఖరులోగా మొదలవవచ్చని తెలుస్తోంది. దీనిలో చిరంజీవికి జోడీగా మృణాళిని ఠాకూర్ నటించబోతున్నట్లు సమాచారం.
సోషియో ఫాంటసీ జోనర్లో తెర్కెక్కిస్తున్న మెగా 157 సినిమాను యూవీ క్రియేషన్స్ బేనర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మించబోతున్నారు. దీనికి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి అందిస్తారు. ఈ త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని దర్శకుడు వశిష్ట చెప్పారు.
దీని తర్వాత చిరంజీవి మళ్ళీ మరో రీమేక్ సినిమాలో నటించబోతున్నారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన బ్రో డాడీ సినిమాకు ఇది తెలుగు రీమేక్. చిరంజీవి తన కుమార్తె సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ల సొంత బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్లో దీనిని నిర్మించబోతున్నారు. నాగార్జునకు ‘బంగార్రాజు’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన కృష్ణ కురసాల ఈ సినిమాకు దర్శకత్వం చేయబోతున్నారు.