సలార్ ఎఫెక్ట్: నితిన్ సినిమా వాయిదా

నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా డిసెంబర్‌ 22న విడుదల కావలసి ఉంది. అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

అయితే అదే రోజున ప్రభాస్ సినిమా సలార్ విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించడంతో  ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోక తప్పలేదు. ఈ సినిమాను రెండు వారాలు ముందుగా డిసెంబర్‌ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుప్రకటించారు. 

ఈ సినిమాలో రావు రమేష్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, సుదేవ్ నాయర్, హర్ష వర్ధన్, శ్రీకాంత్ అయ్యర్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వక్కంతం వంశీ, సంగీతం: హారీష్ జయరాజ్, కెమెరా: ఆర్ధర్ ఏ విలసన్, జె.యువరాజ్, సాయి శ్రీరామ్, కొరియోగ్రఫీ: శేఖర్ విజే, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు. 

శ్రేష్టా మూవీస్ బ్యానర్‌పై ఎన్‌. సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.