
ప్రముఖ తెలుగు సినీ నటుడు జగపతి బాబు ట్విట్టర్‌లో ఓ లేఖ పోస్ట్ చేశారు. ఇకపై తన అభిమాన సంఘాలతో, తన పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టుతో సంబంధాలు తెంచుకొంటున్నాని దాని సారాంశం. ఏ నటుడు తన అభిమాన సంఘాలతో బందం తెంచుకోవాలనుకోడు. కానీ జగపతి బాబు ఎందుకు తెంచుకొంటున్నారు? అంటే అభిమానులమని చెప్పుకొని తనను డబ్బు కోసం పీడిస్తుండటమే కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు.
తన అభిమానులకు తాను ఎప్పుడూ అండగానే ఉంటున్నానని కానీ కొంతమంది అభిమానులకు తన నుంచి ఏదో ఆశించడం ఎక్కువైపోయిందని అందుకే అటువంటి వారితో బంధం తెంచుకొంటున్నానని జగపతి బాబు లేఖలో పేర్కొన్నారు. వారితో అనుబందం తెంచుకోవడం చాలా బాధ కలిగిస్తున్నప్పటికీ తప్పడం లేదని, అయితే నిజమైన అభిమానులను తాను ఎన్నటికీ వదులుకోనని ఆ లేఖలో పేర్కొన్నారు.
జగపతి బాబు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యను మిగిలిన హీరోలందరూ కూడా ఎదుర్కొంటూనే ఉంటారని వేరే చెప్పక్కరలేదు. అయితే వారు బయటకు చెప్పుకొని ఇలా తెగ తెంపులు చేసుకోలేకపోతున్నారు. జగపతి బాబు ధైర్యంగా బయటకు వచ్చేశారు. అంతే! జగపతి బాబు ఆవేదన ఆయన మాటల్లోనే....
నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T
— Jaggu Bhai (@IamJagguBhai) October 7, 2023