
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటిసారిగా ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌ని ఈ సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ విడుదల చేసింది. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ పాత్ర పేరు రాహుల్ సంఘ్వీ.
భగవంత్ కేసరి సినిమాలో నందమూరి బాలకృష్ణకు జోడీగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఫస్ట్-లుక్ పోస్టర్ ఇంతవరకు విడుదల చేయలేదు. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, శ్రవణ్, ప్రియాంకా జవల్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: ఎస్ఎస్ ధమన్, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్: వి వెంకట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ శంకర్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు.
ఆదివారం రాత్రి 8 గంటలకు భగవంత్ కేసరి ట్రైలర్ విడుదలచేయబోతున్నారు. ఈ నెల 19న భగవంత్ కేసరి సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.