1.jpg)
తెలుగులో అద్భుతంగా పాటలు పాడే గాయనీ గాయకులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు తెలుగువారికి మరో మధురగాయకుడు దొరికాడు. నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాకు సంగీతం అందించిన హెషమ్ అబ్దుల్ వాహబ్ ఆ గాయకుడు.
ఆయన ఇప్పటికే అనేక తెలుగు పాటలు పాడారు. హై నాన్న కోసం ఆయన పాడిన గాజుబొమ్మ పాట వాటన్నిటిలోకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అనంత్ శ్రీరామ్ వ్రాసిన పాటలో అనుభూతి ప్రేక్షకుల మనసులను హత్తుకొనేలా హెషమ్ అబ్దుల్ వాహబ్ పాడారు. ఇక నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.
ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు కనుక నాలుగు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. హిందీలో కూడా ఈ పాట చాలా మధురంగా ఉంది. ఈ సినిమాలో నాని కూతురుగా బాలీవుడ్ బాలనాటి కియరా ఖన్నా నటిస్తోంది.
ఈ సినిమాతో శౌర్యూవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్, పృధ్వీ.
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి ఈ ‘హాయ్ నాన్న’ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకావలసి ఉంది. కానీ డిసెంబర్ 21న సలార్ విడుదలవుతుండటంతో కాస్త ముందుగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.