మనసులను తాకేలా గాజుబొమ్మ సాంగ్

నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో గాజుబొమ్మ ప్రమోసాంగ్ నిన్న నాలుగు భాషల్లో విడుదల చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పూర్తి పాటను విడుదల చేయబోతున్నారు. ప్రమోసాంగ్ చిన్న బిట్ మనసులను తాకుతూ తండ్రీకూతుర్ల అనుబంధాన్ని చక్కగా చూపింది. హిందీలో కూడా ఈ పాట చాలా మధురంగా ఉంది.  

ఈ సినిమాలో నాని కూతురుగా బాలీవుడ్ బాలనాటి కియరా ఖన్నా నటిస్తోంది. గాజుబొమ్మ ప్రమో సాంగ్ కోసం విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్‌ బాబు- సితారల పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ సినిమాతో శౌర్యూవ్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంథోని, కొరియోగ్రఫీ: బోస్కో మార్టిస్, స్టంట్స్: విజయ్‌, పృధ్వీ.

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల కలిసి ఈ ‘హాయ్ నాన్న’ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా డిసెంబర్‌ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకాబోతోంది.