2.jpg)
వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో విడుదలకు అనేక చిన్నాపెద్ద సినిమాలు క్యూకట్టి ఉన్నాయి. వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగబోతోంది. జనవరి 13న సైంధవ్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి ఏడి2898 (జనవరి 12), త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న గుంటూరు కారం(జనవరి 12), రవితేజ నటిస్తున్న ఈగల్ (జనవరి 13), ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్ (జనవరి 12), పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న విడి13 (జనవరి), విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ‘నాసామి రంగా (జనవరి)లో విడుదల కాబోతున్నాయి. ఇవి కాక జనవరిలో మరికొన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి.
కనుక ఈసారి ఆయా సినిమాలలో నటిస్తున్న హీరో, హీరోయిన్లకు, వాటి దర్శక నిర్మాతలకు సంక్రాంతిలో అగ్నిపరీక్షలే కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇన్ని సినిమాలతో ఈసారి సంక్రాంతి పండుగే పండుగ.