
మలయాళం నుండి వచ్చిన అమలా పాల్ తమిళంలో చేసిన తక్కువ సినిమాలకే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. అయితే కెరియర్ మంచి జోష్ లో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని పెళ్లిచేసుకుని కెరియర్ ముగించేసిన అమలా అతనితో తెగదెంపులు చేసుకుని మరి మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. వారు విడిపోడానికి కారణాలు మాత్రం తెలియలేదు కాని ఇద్దరు బాధపడుతూ విడిపోయారు. ఇక ఈ టైంలో తను మరోసారి సినిమాల్లో నటించాలని చూస్తుంది అమలా పాల్.
ఇప్పటికే ధనుష్ హీరోగా చేస్తున్న వడా చెన్నై సినిమాలో నటిస్తున్న ఈ భామ ఇప్పుడు తెలుగులో అల్లరి నరేష్ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయట. పెళ్లికి ముందు రాం చరణ్ ఎవడు సినిమాలో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు అల్లరోడికి జోడి కట్టేందుకు రెడీ అవుతుందట. ఇందుకు ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్నట్టు టాక్. అంత ఇచ్చినా సరే అమలా అల్లరి నరేష్ కు జతగా నటించే అవకాశాలు ఉన్నాయా అన్నది చూడాలి. అప్పట్లో మంచు విష్ణు సినిమాకే భారీ రెమ్యునరేషన్ షాక్ ఇచ్చి సినిమా ఆఫర్ ను కాదన్న అమలా ఇప్పుడు అల్లరి నరేష్ తో కలిసి రొమాన్స్ చేసే అవకాశాలు ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.
పెళ్లి తర్వాత కూడా తనకున హాట్ లుక్ అప్పీల్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న అమలా ఛాన్స్ వస్తే ఎలాంటి స్కిన్ షోకైనా సిద్ధమే అన్నట్టు సిగ్నల్స్ ఇస్తుంది. మరి అమలాను సరైన రీతులో వాడుకునే దర్శకుడు ఎవరో చూడాలి. ప్రస్తుతం చర్చల్లో ఉన్న అల్లరి నరేష్ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వెళ్లడవుతాయి.