ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో గుంటూరు కారం జోరుగా దంచుతున్నారు. దానిని నవంబర్‌లోగా పూర్తి చేసి జనవరి 12న విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత ఖాళీ అయిపోతారు. తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా మొదలుపెట్టాల్సి ఉంటుంది.
కానీ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా ఆగస్ట్ 15న విడుదలయ్యే వరకు ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉంటారు. కనుక ఈలోగా మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా పూర్తి చేసేయాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం.
నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడో సినిమా రావలసి ఉంది. కానీ ఇద్దరికీ సమయం చిక్కక, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఇంతకాలం ఆలస్యమయ్యింది. కనుక జనవరిలో గుంటూరు కారం విడుదలైన తర్వాత చిరంజీవితో సినిమా చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కధ కూడా సిద్దం చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించవచ్చని తెలుస్తోంది.
ఒకవేళ చిరంజీవి-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులకు, సినీ ప్రేమికులకు ఇంతకంటే గొప్ప సంతోషకరమైన విషయం ఏముంటుంది?