సినీ చరిత్రలో రామాయాణ సినిమాలని ఆదిపురుష్‌కి ముందు, తర్వాత అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అంతకు ముందు, ఇక ముందు ఎవరూ కూడా ఆదిపురుష్ సినిమాతో రామయాణాన్ని ఖూనీ చేసిన్నట్లు మరెవరూ చేయలేదు చేయకపోవచ్చు కనుక!
అసలు ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ రామాయణగాధతో సినిమా అంటే అందరూ ఉలిక్కి పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఆదిపురుష్ చూసిన తర్వాతే రామయాణాన్ని ఎంత చక్కగా తీయవచ్చో చూపేందుకు కొందరు దర్శక నిర్మాతలు సిద్దమవుతున్నారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ కూడా ఒకరు.
అయితే అది మన వార్త కాదు. ఆయన తీయబోయే సినిమాలో సాయి పల్లవి సీతమ్మవారీగా నటించబోతోందట. ఇదే మన వార్త. ముందు ఆలియా భట్‌ని అనుకొన్నప్పటికీ సాయి పల్లవిని ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ఇంతవరకు పౌరాణిక పాత్ర చేయలేదు. ఆమె రూపురేఖలు, నటన సీతమ్మ పాత్రకు సరిపోతాయి. కనుక ఆమెకు ఈ అవకాశం లభించడం నిజమైతే అదృష్టవంతురాలే.
రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కేజీఎస్ హీరో యష్ రావణుడిగా చేయబోతునట్లు తెలుస్తోంది. అయితే మొదటి భాగం ముగింపు సన్నివేశంలో రావణుడు ప్రవేశించే విదంగా నితీశ్ తివారీ కధని సిద్దం చేసుకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. కనుక ఒకటి రెండు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమా గురించి దర్శకనిర్మాతలే స్వయంగా ప్రకటించనున్నారు.