మరోసారి అతనితో నాని..!

నాచురల్ స్టార్ నాని క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే.. వరుస సినిమాల సక్సెస్ తో ఫుల్ ఫాంలో ఉన్న నాని త్వరలో నేను లోకల్ అంటూ వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం తుది దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత నాని రెండు మూడు ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్స్ పై సైన్ చేశాడట. ఇక అవే కాకుండా ప్రేమకథల స్పెషలిస్ట్ గౌతం మీనన్ తో కలిసి మరోసారి పనిచేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే గౌతంతో ఎటో వెళ్లిపోయింది మనసుతో కలిసి పనిచేశారు.

ఆ సినిమా అంత సక్సెస్ అవ్వకపోయినా ఈ మధ్యనే నానితో కలిసి ఓ కథ డిస్కస్ చేశాడట గౌతం నాని కూడా ఓకే చెప్పేయడంతో సినిమా షురూ చేస్తున్నారు. ప్రస్తుతం గౌతం దర్శకత్వంలో రాబోతున్న సాహసం శ్వాసగా సాగిపో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న గౌతం ఆ సినిమా రిలీజ్ డేట్ తో పాటుగా నానితో సినిమాను కన్ఫాం చేశాడు. తెలుగులో ఇప్పటికే మినిమం గ్యారెంటీ హీరోగా క్రేజ్ సంపాదించిన నాని ఇప్పుడు తమిళ మార్కెట్ మీద కన్నేశాడు. 

ఇప్పటికే కోలీవుడ్లో కూడా కొన్ని సినిమాల్లో నటించిన నాని అక్కడ అంత క్లిక్ అవ్వలేదు. అందుకే గౌతం మీనన్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. మరి క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. గౌతం మీనన్ డైరక్షన్లో నటించాలని ఉంది అని స్టార్ హీరోలైన రాం చరణ్ లాంటి వారు ఆరాటపడుతుంటే తను మాత్రం నానితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.