నిరాశలో మహేష్ ఫ్యాన్స్..!

పండుగ వచ్చిందంటే చేస్తున్న సినిమా గురించి కనీసం ఓ లుక్ అయినా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చేస్తారు స్టార్ హీరోలు. ఈ దీవాళికి స్టార్ హీరోల సినిమాల ఫస్ట్ లుక్స్ అదరగొట్టాయి. అయితే మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం తీవ్రమైన నిరాశే మిగిలింది. మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ వస్తుంది అన్న హడావిడి చేసి చివరకు హ్యాండ్ ఇచ్చేశాడు మహేష్ బాబు. దసరా, దీపావళి ఇలా రెండు పండుగలకు ఫ్యాన్స్ కు తన కానుక అందించలేదు.

దీనికి కారణం ఏమై ఉంటుందా అన్నది తెలియదు కాని కనీసం ఓ లుక్ రివీల్ చేయకుండా ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు. ఓ పోస్టర్ రిలీజ్ చేయడం ఒక్కరోజు పని కాని సినిమా గురించి ఎలాంటి క్లూ దొరకకూడదు అనే ప్లాన్ తో ఇలా చేస్తున్నారని తెలుస్తుంది. ఒకేసారి సినిమా ట్రైలర్ తో షాక్ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

సినిమా టైటిల్ విషయంపై కూడా ఇంకా ఓ క్లారిటీ రాలేదు. మరి ఈ కన్ ఫ్యూజన్ ఎప్పుడు వీడుతుందో చూడాలి. మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా అంచనాలకు మించి వచ్చేలా చూస్తున్నారట. 80 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్వీ ప్రసాద్ ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.