
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.
2012, జనవరి 17న ఆ సినిమా ఇంటర్వెల్ సన్నివేశాలను షూటింగ్ చేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నిన్న వారిద్దరి కాంబినేషన్‌లోనే తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇంటర్వెల్ సన్నివేశాలను హైదరాబాద్‌లో షూటింగ్ చేశారు, అంటూ పవన్ కళ్యాణ్ అభిమాని సతీశ్ బొట్ట ట్వీట్ చేస్తూ ఆనాడు లొకేషన్‌లో హరీష్ శంకర్‌తో కలిసి తీసుకొన్నఫోటోను షేర్ చేశారు.
దానిపై హరీష్ శంకర్ స్పందిస్తూ, “నా పట్ల, పవన్ కళ్యాణ్ పట్ల మీరు చూపుతున్న ఈ బేషరతు ప్రేమాభిమానాలకు చాలా థాంక్స్ సతీష్,” అంటూ ట్వీట్ చేశారు.
నిజమే కదా? ఒక సినిమాని, దాని హీరోని అభిమానులు గుర్తుపెట్టుకోవడం సహజమే. కానీ దశాబ్ధం క్రితం జరిగిన ఆ సినిమా ఇంటర్వెల్ షూటింగ్‌ని తేదీతో సహా గుర్తుపెట్టుకొని దర్శకుడిని అభినందించడం విశేషమే కదా?
Thanks Satish…. Appreciate ur unconditional support and love towards me and our @PawanKalyan 😍😍😍 https://t.co/pmMIIoWw2l
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా పంకజ్ త్రిపాఠి, గౌతమి, అశోతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, నాగ మహేష్, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, కౌశిక్ మెహతా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్: సంగీతం, ఆయనంకా బోస్: సినిమాటోగ్రఫీ, ఆర్టిస్ట్: ఆనంద సాయి చేస్తున్నారు.
నవీన్ ఎర్నేని, వైసీపీ. రవిశంకర్ కలిసి రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.