రాజమౌళి దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా 2023లో భారత్‌కు ఆస్కార్ అవార్డ్ సాధించిపెట్టింది. వచ్చే ఏడాదిలో జరుగబోయే ఆస్కార్ అవార్డుల కోసం మళ్ళీ హడావుడి మొదలైంది. భారత్ తరపున మలయాళ చిత్రం 2018ని నామినేషన్స్ కోసం ఎంపిక చేసిన్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. కన్నడ చిత్ర దర్శకుడు గిరీష్ కాసారవల్లి నేతృత్వంలోని జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన్నట్లు తెలిపింది.
2018లో కేరళలో వచ్చిన వరదల నేపధ్యంతో ఆందోని జోసఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అన్ని భారతీయ భాషల్లోకి అనువదించి విడుదలచేశారు. ఈ సినిమాలో మలయాళ నటులు టోవినో ధామస్, బోబన్, అపర్ణ బాలమురళి, ఆసిఫ్ ఆలీ, నరేన్, తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
96వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజలీస్ నగరంలో ప్రఖ్యాత డల్బీ థియేటర్లో 2024, మార్చి 10వ తేదీన జరుగుతాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పోటీ పడుతుంటాయి. కనుక 6-7 నెలల ముందు నుంచే చిత్రాల ఎంపిక, నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంటుంది.
2023లో ఆర్ఆర్ఆర్ భారత్‌కు ఆస్కార్ అవార్డు సాధించింది. మరి 2024లో కూడా భారత్‌కు ఆస్కార్ అవార్డు సాధించగల సినిమా ఏదైనా ఉంటుందా?తెలుగులో బలగం సినిమాకు ఆ అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.