
మెగాస్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో మెగా కాంపౌండ్ లో మళ్లీ నూతనోత్సాహం ఉప్పొంగుతుంది. 9 ఏళ్ల విరామం తర్వాత మెగా మేనియా షురూ చేసిన చిరంజీవి ప్రతి ఒక్క ఈవెంట్ ను తన సినిమాకు ప్రమోషన్ అయ్యేలా వినియోగించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ దీవాళి నాడు మెగా హీరోలంతా ఒక్క చోట చేరితే ఎలా ఉంటుంది ఆ ఫ్రేమింగే అదిరేలా ఉంటుంది కదా సో ప్రస్తుతం ఆ మెగా పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. దీవాళి నాడు మెగాస్టార్ తో మిగతా మెగా హీరోలు దిగిన ఈ పిక్ మెగా ఫ్యాన్స్ ను విఫరీతంగా ఆకట్టుకుంటుంది.
అయితే ఈ పిక్ లో పవర్ స్టార్ ఒక్కడు తక్కువయినట్టు కనిపిస్తున్నా సరే మెగా కాంపౌండ్ నుండి పవన్ ఎప్పుడో ఎక్సిట్ అయ్యాడని అధికారికంగా వినిపిస్తున్న మాటే. సో మెగా సపోర్ట్ తో వచ్చిన మెగా హీరోలంతా ఒక్కచోట చేరి దిగిన ఈ పిక్ చూసేందుకు రెండు కళ్లు చాలవంటే నమ్మాలి. ఓ విధంగా మెగా ఫ్యామిలీదే పండుగంతా అన్న తీరున ఈ పిక్ సందడి చేస్తుంది. స్లిం లుక్ లో మెగాస్టార్ మరింత అందంగా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం ఖైది నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరు సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వినాయక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా రాం చరణ్ నిర్మిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.