
ప్రస్తుతం ప్రేమం హిట్ తో మంచి జోష్ లో ఉన్న నాగ చైతన్య అక్కినేని ఫ్యాన్స్ కు ఈ ఉత్సాహాన్ని మరింత పెంచేలా తన సినిమా సాహసం శ్వాసగా సాగిపోను రిలీజ్ చేస్తున్నాడు. గౌతం మీనన్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంది. అయితే తమిళంలో ఈ సినిమా శింభు హీరోగా చేస్తుండటంతో సినిమా లేట్ అయ్యింది. ఫైనల్ గా సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ డేట్ కన్ఫాం చేశారు. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అసలైతే ప్రేమం కంటే ముందు ఈ సినిమానే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా తమిళ సినిమా వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవుతూ వచ్చింది. ప్రేమకథలను తన స్టైలిష్ డైరక్షన్ తో అందంగా చూపించే గౌతం మీనన్ ఈ సినిమాను ఎంతో ప్రేమించి చేశాడు. శింభు గొడవల వల్ల తమిళంలో లేట్ అవడంతో ఆ ఎఫెక్ట్ తెలుగు సినిమాకు పడింది. మరి మొత్తానికైతే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు కాబట్టి అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు.
సినిమా ఫస్ట్ కాపీ చూసిన దిల్ రాజు సినిమాను నైజాం లో తానే డిస్ట్రిబ్యూట్ చేస్తానని రైట్స్ తీసుకున్నాడట. మరి చైతుకి ఈ సినిమా కూడా ప్రేమం లాంటి మెమరబుల్ హిట్ అందించాలని ఆశిద్దాం.